ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రభుత్వం ముందు చూపులేని నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటోడ్రైవర్‌కు 12వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించారు.
Admin
Aakanksha News