Sunday, 26 April 2026 05:30:58 PM

ఓపెన్ ప్లాట్ల వేలానికి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి

కలెక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ.

Date : 01 May 2023 10:47 PM Views : 1068

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : మే 2వ తేదీన నిర్వహించే రాజీవ్ స్వగృహ అక్షయ టౌన్ షిప్ 22 ఓపెన్ ప్లాట్ల వేలానికి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు. గోదావరిఖనిలోని సింగరేణి కమ్యూనిటీ హాల్ లో మంగళవారం నిర్వహించే ఓపెన్ ప్లాట్ల వేలానికి సంబంధించి చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సోమవారం పరీశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్గాం మండలం కుందన పల్లి గ్రామంలో డి.టి.సి.పి. ఆమోదం పోందిన రాజీవ్ స్వగృహ అక్షయ టౌన్ షిప్ లో మిగిలిన 22 ఓపెన్ ప్లాట్ల వేలం గోదావరిఖనిలోని సింగరేణి కమ్యూనిటీ హాల్ లో మే 2న ఉదయం 10-30 గంటలకు నిర్వహించడం జరుగుతుందని దీనిని ప్రజలు వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.గోదావరిఖనిలోని సింగరేణి కమ్యూనిటీ హాల్ లో మంగళవారం 22 ఓపెన్ ప్లాట్ల వేలానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసామని, వేలంలో పాల్గొనేందుకు వచ్చే ప్రజల కోసం అవసరమైన మేర కౌంటర్, సహాయ డెస్క్ లు ఏర్పాటు చేసామని కలెక్టర్ తెలిపారు.ఆసక్తిగల వారు ప్రత్యేక వేలంలో పాల్గొని ప్లాట్లు సొంతం చేసుకోవాలని, ప్రత్యేక వేలంలో పాల్గొనేందుకు మొదటిసారి వేలంలో దరఖాస్తు చేసుకునేవారు పదివేల రూపాయల విలువ గల డిడిని జిల్లా కలెక్టర్, పెద్దపల్లి పేరున తీసి వేలంలో పాల్గొనాలని తెలిపారు. అలాగే పాత రాజీవ్ స్వగృహ దరఖాస్తుదారులు ఎవరైతే రూ. 3500/- లేదా రూ. 5000/- లు రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించిన వారు ఒరిజినల్ మీసేవా రసీదును సమర్పించి వేలంలో పాల్గొనాలని సూచించారు. వేలంలో ప్లాట్ వచ్చినవారు వారం రోజుల్లోగా మొదటి విడత 33శాతం డబ్బులు, రెండవ విడత 45 రోజులలో 33శాతం, మిగిలిన మొత్తాన్ని 90 రోజులలో పూర్తిగా చెల్లించిన తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్ ఓ సి ఇవ్వడం జరుగుతుందని, ఈ ఎన్.ఓ.సి ద్వారా ఇళ్ల నిర్మాణానికి బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :