Saturday, 13 June 2026 01:22:20 PM

నేడే మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ...

Date : 07 October 2022 09:11 AM Views : 499

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : నేటి నుండి మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ప్రారంభం అయింది.నామినేషన్లు దాఖలకు ఈనెల 14 వరకు చివరి గడువు కావడంతో ఈ నెల 10 న బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే 11 న కాంగ్రేస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి 2 సెట్లతో నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు.14 న మరోసారి స్రవంతి భారీ ఎత్తున నామినేషన్ వేయనున్నారు. ఈనెల 12న టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండడంతో 13 లేదా 14న టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.ఈనెల 14 లోగా సీఈసీ గుర్తిస్తే మునుగోడులో బీఆర్ఎస్ తరుపున కూసుకుంట్ల పోటీ చేస్తారు. లేదంటే టీఆర్ఎస్ తరపున ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్నారు.చండూరు ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు సమయాన్ని కేటాయించారు. అలాగే శని,ఆదివారాల్లో నామినేషన్లు దాఖలకు సెలవు ప్రకటించడం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆసక్తిని కలిగిస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :