ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సిద్దిపేట జిల్లా : శ్వేత పత్రాలు హామీల ఎగవేతల పత్రాలా? అనే అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ ఎల్పీలో ఆదివారం చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందరోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, మార్చి 17తో వంద రోజులు పూర్తవుతాయన్నారు. జిల్లాల్లో పర్యటించినపుడు రైతుబంధు ఇంకా తమకు రాలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంటున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయని, ఫిబ్రవరి నెలాఖరులో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు. కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌లోపే ఆరు గ్యారంటీల్లోని పదమూడు హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.అంతే కాకుండా సీఎం స్థాయి వ్యక్తి వాహనాలు దాచిపెట్టడం అని మాట్లాడటం సరికాదని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం దాచడం ఏం ఉంటుందని ప్రశ్నించారు. బులెట్ ప్రూఫ్ కోసం వాహనాలు ఎవ్వరైనా విజయవాడకు పంపాల్సిందేనన్నారు. అవి సీఎం వాడుకోరా? ప్రభుత్వం వాడుకోదా? అని ప్రశ్నించారు. ప్రతి భవన్‌లో అన్ని రూంలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అన్నారని.. ఇప్పుడు డిప్యూటీ సీఎం, మిగతా వారు ప్రగతి భవన్‌లో ఉంటున్నారని.. ఎన్ని గదులు ఉన్నాయో వారే చెప్పాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోగా కాంగ్రెస్ గ్యారెంటీలకు మార్గదర్శకాలు ఇచ్చి జీవోలు విడుదల చేయాలన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితేనే గ్యారంటీలు సరిగా అమలవుతాయని.. లేకపోతే అన్నింటికీ కోతలు తప్పవన్నారు.
Admin
Aakanksha News