ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నేను బ్రతికున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ ను కానీ వీడేది లేదని హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలపై ఆయన ఖండించారు అనంతరం ఆయన మాట్లాడుతూ... గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసామని అంతమాత్రాన బిజెపిలో చేరుతున్నట్లు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని..ఆయనను వీడే ప్రసక్తే లేదని అన్నారు. మళ్ళీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసుకుంటాం అని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం కేసీఆర్ హయంలో జోడెడ్లలా సాగింది పేర్కొన్నారు.నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మా రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేసారు.సీఎంను కలిసినంత మాత్రాన మేమేదో పార్టీ మారుతున్నట్టు దుష్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముందు రైతుబంధు సాయం వేసి, రైతు రుణ మాఫీ చేయలని అన్నారు. మళ్లీ ఎన్నికల కోడ్ రాకముందే హామీలను నెరవేర్చాలన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి విజ్ఞప్తి చేశానాని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Admin
Aakanksha News