ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఖమ్మం జిల్లా : మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి' గారి ఆదేశాల మేరకు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ 'మెట్టు సాయికుమార్' గారి ఆధ్వక్షతన ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హాజరై చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో పాటుగా ఎంపీ రఘు రామ్ రెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ విజయ బాబు గారు, రాష్ట్ర మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా మత్స్య శాఖ అధికారి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News