Thursday, 30 July 2026 12:34:25 PM

తెలంగాణ బిషప్ కౌన్సిల్ జిల్లాల కార్యనిర్వాహకుల సభ్యుల నియామకము..

Date : 14 February 2025 08:55 PM Views : 567

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : టీబీసీ స్టేట్ కోఆర్డినేటర్ మరియు హోలీ ప్రిన్స్ గాస్పల్ మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులు దైవజనులు బిషప్ డాక్టర్ కొమ్ము ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బిషప్ ఎం ప్రదీప్ కుమార్ సహకారంతో తెలంగాణ బిషప్ కౌన్సిల్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు బిషప్ ఆర్ టి రెవరెండ్ డాక్టర్ ఆర్ విక్రమ్ పాల్ మరియు జాయింట్ సెక్రెటరీ ఏసు పాదం సమక్షంలో హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి ,మేడ్చల్ మరియు వికారాబాద్ యొక్క జిల్లాల అధ్యక్షులను జనరల్ సెక్రెటరీలను ట్రెజరర్లను మరియు జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను నియమించడం జరిగినది. హోలీ ఫ్రెండ్స్ గాస్పల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ బీరంగూడ బ్రాంచ్ అమీన్పూర్ మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో టీబీసీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు దైవజనులు బిషప్ విక్రమ్ పాల్ అయ్య,టీబీసీ యొక్క విలువలను తెలియపరుస్తూ పలు జిల్లాల నుండి వచ్చిన బిషపులను జిల్లా అధికారులుగా ఎన్నుకోబడిన వారికి టీబీసీ కొరకు మరింతగా కష్టపడాలని దేవునికి మహిమ కరముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే అధ్యక్షులుగా ఏకతాటిగా నిలబడి మన పూర్వకంగా దేవునికి నచ్చే మెచ్చే అధ్యక్షులుగా ఉండాలని అంగీకరించిన వారందరికీ అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలు జిల్లాల దైవజనులు బిషప్ లు మరియు కమిటీ సభ్యులు టీబీసీ స్టేట్ బాడీ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు తాము టీబీసీ లో ఉండడము ఎంతో సంతోషకరమని ఎవరు గుర్తించలేని మమ్ములను టీబీసీ ద్వారా గుర్తించిన బిషప్ విక్రం పాల్ అయ్యకు మరియు స్టేట్ బాడీ కమిటీవారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానంతరము అతిథి సత్కారములతో మరియు ఆత్మీయ ప్రేమవిందుతో పాటు చివరి ఆశీర్వాద ప్రార్థనలతో ముగిసినది

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :