Friday, 31 July 2026 03:51:32 PM

గ్రూపు 2 పోస్టులను పెంచాలి..

ముఖ్యమంత్రికి రాజ్యసభ సభ్యులు,జాతీయ బీసీ సంక్షేమ సంఘం, అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి

Date : 01 March 2025 07:18 PM Views : 745

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : గ్రూప్ 2 పోస్టులను 783 నుంచి 3 వేలకు పెంచాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యకులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాశారు.గ్రూప్ 2 పోస్టులు పెద్ద మొత్తంలో వస్తాయి కానీ సంబందిత శాఖ అధికారులు తప్పుడు లెక్కలు చేసి తక్కువ చూపిస్తున్నారు.కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, మండలాలకు మున్సిపాలిటీలకు కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. వీటిని వెంటనే మంజూరు చేయాలి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించాలి. వాటిలో గ్రూప్-2 లో శాఖల బట్టి 30 నుంచి 40 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తి స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలని కోరారు .రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ 23 జిల్లాలోని వాటిలో 40 శాఖల జిల్లా ఆఫీసులు, తాలూకా ఆఫీసులు ఏర్పడ్డాయి. అలాగే 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజినల్ ఆఫీసులు, 76 మున్సిపాలిటీలు. 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 25 DSP ఆఫీసులు, 31 పోలీస్ సర్కిల్స్, 7 పోలీస్ కమిషనరేట్లు, 4,383 గ్రామపంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇందులో గ్రూప్-2 సర్వీస్ పోస్టులు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, మండలాలకు మున్సిపాలిటీలకు కొత్త పోస్టులు మంజూరు చేయలేదని, వీటిని వెంటనే మంజూరు చేయాలన్నారు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించాలని, వాటిలో గ్రూప్-2 లో 30 నుంచి 40 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తి స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలన్నారు. అలాగే గత 10 సంవత్సరాలుగా గ్రూప్-1 స్థాయి పోస్టులు, గ్రూప్-2 పోస్టులలో ఎంతమంది రిటైర్ అయ్యారని,ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు. లెక్కించి భర్తీ చేయాలని లకోరారు.కొత్త తరాన్ని - యువతరాన్ని డైరెక్టు రిక్రూట్ మెంట్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకువస్తే సమర్ధవంతమైన, అవినీతికి తావులేని పాలన లభిస్తుంది. యువత శక్తి-యుక్తులు సమాజాభివ్రుద్దికి ఉపయోగించ వచ్చును. యువతను పాలనరంగం లోకి తీసుకువస్తే ఉత్సాహంతో, అంకిత భావంతో నిజాయితీగా పని చేస్తారన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :