Sunday, 26 April 2026 06:42:46 PM

3న జరిగే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి విద్యార్ధి లోకం కదిలిరావాలి...

Date : 01 January 2025 06:40 PM Views : 430

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రము లో 16లక్షల75వేలమంది విద్యార్ధుల ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపుమేరకు జనవరి 3న జరిగే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, అర్దిఓ,ఎం అర్ ఓ కార్యాలయాల ముట్టడి కి విద్యార్ధి లోకం కదిలిరావాలని బిసి విద్యార్ధి సంఘం రంగారెడ్డి జిల్లా అద్య్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ పిలుపు నిచ్చారు. “కాంట్రాక్టర్ల బిల్లులు వేలకోట్లు చెల్లిస్తున్నారు - విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు వందల కోట్లు కూడా చెల్లించడం లేదని అందుకు ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, RDO, MRO కార్యాలయాలు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.మూడు సంవత్సరాలుగా విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు చెల్లించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి స్కాలర్ షిప్ లకు కూడా బిల్లులు ఇవ్వడం లేదన్నారు.గత నాలుగు నెలలుగా విద్యార్థులు రోడ్లమీద వచ్చి ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆర్థిక శాఖ మంత్రికి కాంట్రాక్టర్లు అంటే చాలా ప్రేమ ఉంది. కానీ విద్యార్థులు అంటే పట్టించుకోవడం లేదు. తన వైఖరి మార్చుకోకపోతే తీవ్రంగా తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. గతంలో స్కాలర్ షిప్ లు, ఫీజుల బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీ బంద్ చేస్తే విద్యార్థుల చదువు దెబ్బ తింటుందని కాలేజీ యాజమాన్యాలకు నచ్చజెప్పి పునః ప్రారంభ చేసాము. కానీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ఇప్పుడు అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు కలిపి నిరవదికంగా బంద్ లో పాల్గొనాలని చంద్ర శేఖర్ గౌడ్ పిలుపు నిచ్చారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :