ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఎదురుదెబ్బ తగిలింది. రామగుండం రీజియన్ లోని ముగ్గురు అగ్రనేతలు బి. వెంకట్ రావు, మిర్యాల రాజిరెడ్డి. కేంగర్ల మల్లయ్య లు కార్మిక సంఘం యూనియన్ కు రాజీనామా చేస్తున్నట్లు తమ రాజీనామా పత్రాన్ని హైదరాబాదులోని కవిత నివాసంలో తనకు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరీ కొన్ని రోజుల్లో సింగరేణి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అగ్రనేతల రాజీనామాతో సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పరిస్థితి అయోమయంగా మారింది.
Admin
Aakanksha News