ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సెట్విన్ సీతాఫల్మండి శాఖ ఆధ్వర్యంలో యువతీ యువకులకు పలు ఉపాధి కోర్సులకు శిక్షణ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సీతాఫల్మండి శాఖ ఇన్చార్జి వై.అనిత తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెస్ ఆఫీస్, డిటిపి, Tally, సీసీటీవీ, సెల్ ఫోన్ రిపేరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, బ్యూటీషియన్ వన్ ఇయర్ డిప్లమా టీచర్ ట్రైనింగ్ తదితర కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు 10వ తరగతి,ఇంటర్ పాస్ అయి లేదా ఫెయిల్ అయిన విద్యార్థిని విద్యార్థులు గృహిణులకు ఇందులో శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్ 81 42 43 93 36 నంబర్ను సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు
Admin
Aakanksha News