Friday, 31 July 2026 01:19:18 PM

సింగరేణి ని దివాలా తీయించిన టిబిజికేఎస్ ను బొంద పెట్టండి.

ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య

Date : 21 November 2022 03:58 PM Views : 767

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణి ని దివాలా తీయించిన టిబిజికేఎస్ ను బొంద పెట్టండి అని ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం వల్లనే బొగ్గు గని కార్మికుల 11వ వేజ్ బోర్డు ఆలస్యం జరుగుతుందని, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం పై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు.సోమవారం సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జిడికే 2ఏ. ఇంక్లయిన్ లో ఏఐటీయూసీ ఆర్జీ- 1 బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2015 లో బొగ్గు గనుల జాతీయకరణ చట్టాన్ని కమర్షియల్ మైనింగ్ చట్టంగా మార్చి దేశంలో కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యం అన్వేషణ విభాగం ద్వారా గుర్తించిన బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరిస్తందని అన్నారు. 2012 నుండి సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్,ఓసీపీ లలో కాంట్రాక్టీకరణను పెంచి పోషించిన రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే గుర్తింపు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సింగరేణిని ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ నుండి రక్షించుకోవడానికి కార్మిక వర్గం ఏఐటీయూసీ ఇచ్చే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దోపిడి వల్ల అప్పుల పాలైందని ఆయన విమర్శించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని, సింగరేణిలో ఎన్నికలు పెడితే టిబిజికేఎస్ ఓడిపోతుందనే ఆలోచన తో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం టిబిజికెఎస్ కలిసి ఎన్నికల కాలపరిమితి ముగిసినా సింగరేణిలో ఎన్నికలు పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఏ యూనియన్ తో సంబంధం లేకుండా ఏఐటీయూసీ ఒంటరిగా హైకోర్టు లో కేసు వేయడం జరిగిందని,హైకోర్టు విచారణ జరిపి సింగరేణి లో మూడు నెలల లోపు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కార్మిక శాఖకు,సింగరేణి కి ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు.వెంటనే హైకోర్టు తీర్పు ప్రకారం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు, లేకుంటే మళ్ళీ కోర్టు కు వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కన్వీనర్ ఆరెల్లి పోషం, బ్రాంచి ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్, నాయకులు ఎస్.వెంకట్ రెడ్డి, పోలవరపు నాగేంద్ర కుమార్, కారంపూడి వెంకన్న, గొడిశల నరేష్, సల్ల రవిందర్, గంగారపు చెంద్రయ్య, సిరిసిల్ల మల్లేశ్, ఏ.వి.ఎస్. ప్రకాశ్ తో పాటు ఆఫీసు కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :