Thursday, 30 July 2026 12:48:16 PM

బీజేపీ పిలిచి రాజ్యసభ ఇచ్చింది....

బీసీల కోసమే పోరాటం చేస్తా...బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య

Date : 10 December 2024 08:42 PM Views : 526

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్లు ప్రకియ పూర్తి అయింది. రాజ్యసభ అభ్యర్థులను బలపరిచేందుకు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. మూడు రాజ్యసభ అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు అసెంబ్లీకి 40 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడి నామినేషన్ కోసం పదిమంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అయితే నామినేషన్ వేసిన సందర్భంగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పిలిచి రాజ్యసభ ఇచ్చిందని తెలిపారు.బీసీల కోసమే పోరాటం చేస్తానని చెప్పారు. ఎక్కడ ఉన్నా ఎప్పుడు బీసీల సమస్యల కోసం పోరాటం చేశానని గుర్తుచేశారు.చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పిలిచి తనకు రాజ్యసభ టికెట్ ఇచ్చిందని అన్నారు. సీఎం చంద్రబాబు తనను రాజకీయాల్లోకి పిలిచారని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు..50 ఏళ్లు బీసీల కోసం పోరాటం చేశానని చెప్పారు. వైసీపీకి పార్టీలో మాట్లాడే అవకాశం తక్కువ అని.. బీసీల గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుందని పార్టీ మారానని తెలిపారు.బీజేపీ తనకు కొత్త కాదని.. తాను కండువా కప్పుకున్న మొదటి పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. పార్టీల కండువాలు వేసుకోలేదు. అన్ని పార్టీలు బీసీల కోసం న్యాయం చేస్తున్నాయని చెప్పారు. పార్టీలే తన దగ్గరకు వచ్చాయని బీజేపీ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :