Thursday, 30 July 2026 02:04:08 PM

బీఆర్ఎస్ నాయకులే డ్రగ్స్ మాఫియా బ్యాచ్...

పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్..

Date : 29 October 2024 07:26 PM Views : 400

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకులే డ్రగ్స్ మాఫియా బ్యాచ్అని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ అన్నారు.మంగళవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ అందుకే వారికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ నాయకులకు దండు పాళ్యం బ్యాచ్ అని పేరు పెట్టిండని అన్నారు.బీఆర్ఎస్ దండు పాళ్యం బ్యాచ్ ఇదంతా చేస్తుందన్నారు.సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ మాఫియా బ్యాచ్ పై ఉక్కు పాదం మోపాలన్నారు.బీఆర్ఎస్ దండు పాళ్యం బ్యాచ్ దీపావళి ముందు కాళ్లకు గజ్జెలు కట్టుకుని జనక్ జనక్ పాయల్ బాజా చేస్తుండ్రు జన్వాడ పామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ చేసిండ్రుఎదో ఒకటి చేసి తెలంగాణ లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.దీపావళి ముందు గెట్ టూగేదర్ అంటానికి కేటీఆర్, హరీష్ రావు లకు సిగ్గు ఉండాలి ఫ్యామి పార్టీ అయితే డ్రగ్స్,క్యాషియోనా ఎలా దొరుకతదని ప్రశ్నించారు.మూసిని బాగు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారన్నారు.త్వరలో రంగా రెడ్డి జిల్లా రైతులందరం మూసి ప్రక్షాళన కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :