ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సీఎస్ఆర్ నిధులతో ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేసే సింగరేణి యాజమాన్యం తన సొంత పరిధిలోని కార్మికుల నివాస ప్రాంతాలకు,గనులకు వెళ్లే రోడ్డు మార్గాలను ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించు కోవడం లేదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దఎత్తున 3వ ఇంక్లైన్ రోడ్డు జంక్షన్ వద్ద రాస్తారోకో చేశారు. అనంతరం బైక్ ర్యాలీగా వెళ్లి రామగుండం-1 ఏరియా జిఎంకి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ... అర్జీ-1 ఏరియాలోని జీడికే 11 ఇంక్లైన్ కు వెళ్లే కార్మికులు మంథని క్రాస్ రోడ్డు నుండి గని వరకు వెళ్లే రోడ్డు పూర్తి స్థాయిలో గుంతలతో ఉందని అన్నారు. కనీసం రోడ్డు వెంట చీకట్లో లైటింగ్ సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. వర్షం వస్తే గుంతలలో నీరు నిండడం వలన కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా జీడికే1&3 2&2A,రోడ్డు జంక్షన్ వద్ద నిలిచిపోయిన రోడ్డును పూర్తి స్థాయిలో బాగుచేయాలని, 2ఏ మోరి డ్రైనేజీతో ప్రవహిస్తు ఉండటంతో వర్షంలో దిచక్ర వాహనాలు నీటిలో సైతం కొట్టుకుపోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయని అయిన యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనితో పాటే సీఎస్పీలో బొగ్గు దుమ్ము కాలుతున్న పొగతో సీఎస్పీ జీడికే,1&3, 2&2ఏ కార్మికులు అనారోగ్యాల పాలవుతున్నారని గతంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తాత్కాలికంగా ఉపశమనం చర్యలతో సరిపెట్టడాన్ని నిరసిస్తూ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ బ్రాంచ్ కమిటీ పిలుపు మేరకు పలువురు కార్మికులు స్వచ్ఛందంగా రాస్తారోకో,ర్యాలీగా అర్జీ-1 జీఎం ఆఫీస్ కు రావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన పనులకు నిధులను కేటాయించడంలో చూపే శ్రద్ధ యాజమాన్యం బాధ్యతగా కార్మిక కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని అన్ని గనులకు వెళ్లే రోడ్డు మార్గాలను శాశ్వతంగా బాగు చేయాలని లైటింగ్ పూర్తిస్థాయిలో మెరుగుపరిచి విధులకు వెళ్లే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అర్జీ-1 కార్యదర్శి మెండె శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శి జెల్లా గజేంద్ర, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, ఆరెపల్లి రాజమౌళి, బొద్దుల రఘువరన్, అన్నం శ్రీనివాస్,దాసరి సురేష్, మల్లేష్, నంది నారాయణ, సాయికృష్ణ, సాగర్,శశి, సత్యనారాయణ రావు, దుర్గాప్రసాద్, మంగళ రాములు, శ్రీనివాసరావు,పులి ఈశ్వర్,కుమార్, జీడికే11,2&2ఏ 1&3,సీఎస్పీ, ఏరియా వర్క్ షాప్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News