Friday, 31 July 2026 11:26:46 PM

కార్పొరేటర్ వేధింపులకు మున్సిపల్ కార్యాలయం ఎక్కిన కాంట్రాక్టు కార్మికుడు...

సోషల్ మీడియాలో పెట్టి వేధిస్తున్నాడని కాంట్రాక్ట్ కార్మికుడి ఆవేదన...

Date : 04 October 2024 09:13 AM Views : 1161

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ డివిజన్ కార్పొరేటర్ తన గురించి సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని మనస్థాపం చెంది కాంట్రాక్ట్ కార్మికుడు కనకయ్య కార్పొరేషన్ కార్యాలయం పైకి ఎక్కి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. దీంతో సమాచారం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని కనకయ్యకు నచ్చ చెప్పడంతో కిందికి దిగారు. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ....32వ డివిజన్ లో లైట్ రావడం లేదని.. దానిని సరి చేయమని దేవయ్య అనే వ్యక్తి నాకు ఫోన్ చేశారని నేను మరో డివిజన్ లో పనిచేస్తున్నానని చెప్పిన కూడా వినకుండా నా గురించి సోషల్ మీడియాలో మూడు రోజులుగా తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సదరు వ్యక్తి మూడు రోజులుగా ఓ కార్పొరేటర్ తో ఫోన్ చేయిస్తూ ఇబ్బందుల గురి చేస్తున్నారని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :