Thursday, 30 July 2026 09:53:46 AM

సుదరికరన పేరుతో ప్రజా దనం దుర్వినియోగం.

ముందు చూపు లేని రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ పాలకవర్గం.

Date : 20 October 2022 09:22 PM Views : 569

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని మార్కండేయ కాలనీ రాజేష్ థియేటర్ టీ జంక్షన్ కూడలిలో సుందరి కరణ పేరుతో రోడ్డు నడి మధ్యలో తవ్వి ప్రజలను ఇబ్బంది పెట్టడాన్ని నిరసిస్తూ న్యూ ఇండియా పార్టీ నాయకులు అదే కూడలి వద్ద నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. అనంతరం రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా న్యూఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా.జె.వి. రాజు మాట్లాడుతూ. ఈ ప్రాంతంలో కాలేజీలు ఆసుపత్రులు,సిమెంట్ గోడన్స్ అధికంగా ఉన్నందున బారి వాహనాలకు నూతనంగా నిర్మించే కూడలిలో కనీసం తిరిగే అవకాశం లేదని అన్నారు. అలాగే వాహన దారులకు ఇబ్బందిగా మారనుందని ఈ అనాలోచిత నిర్మాణాన్ని ఖండిస్తూన్నామని పేర్కొన్నారు.ముందు చూపు లేని రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ ప్రజధనం దుర్వినియోగం చేస్తు ప్రజలని అసౌకర్యానికి గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని మండిపడ్డారు. అవసరంలేని కట్టడాలు కట్టి ప్రజలని ఇబ్బందులకు గురి చేయకూడదని సూచించారు లేని పక్షంలో న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో కార్పోరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ ఉపాధ్యక్షులు వేముల అశోక్, బి గోపాల్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి ,నాయకులు విక్రంసింగ్, ఆషాడం ముకేశ్, మదరబోయిన బాణయ్య, బోగిరి పొశం,పటేల్,స్టాలిన్ ఆర్ నర్సయ్య,ఆకాశ్ హృదయ్ రాచకొండ జై చంద్ర ,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :