Friday, 31 July 2026 02:39:55 PM

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి విద్యార్థుల నుండి నిరసన సెగ

Date : 28 November 2022 12:13 PM Views : 508

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సంగారెడ్డి జిల్లా : ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి విద్యార్థుల నుండి చేదు అనుభవం ఎదురైంది. శ్రీ అనంత పద్మనాభ కాలేజీ విద్యార్థుల నుండి నిరసన సెగ తగిలింది. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ సహా స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకపోవడంతో ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను అడ్డుకొని విద్యార్థులు అక్కడే బైఠాయించారు. సమస్య పరిష్కరించే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదంటూ బీష్మించి కూర్చున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :