ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్ తో ఐదుగురు ఇంటర్ విద్యార్థినులకు అస్వస్థత గురైన విషయం తెలిసిందే... అయితే విద్యార్థినిలను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కళాశాలకు వెళ్లగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు లేనిది కళాశాలలోకి అనుమతించమని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు ఉంచితంగా ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రెసిడెన్షియల్, గురుకుల, సంక్షేమ పాఠశాలలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు విద్యను అందించారన్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలను స్థాపించిన ఘనత కేసిఆర్ దే అన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని గురుకుల పాఠశాలు, కళాశాలల్లో ఎస్సీ, ఎస్సీ, బిసి, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తమైన పరిస్థితి, నిర్వాహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని విమర్శించారు.గురుకుల పాఠశాలల్లో భోజనం బాగా లేదని, పాములు,ఎలుకలు వచ్చి కురుస్తున్నాయని తినే ఆహారంలో బల్లులు పడి విద్యార్థులు ఆసుపత్రిలో పలు కావడం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయని, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలో పాము కాటు వేసి ఓ విద్యార్థి మరణించడం జరిగిందని, మళ్ళీ అదే గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారన్నారని విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 57 మంది గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. అన్ని వర్గాలకు సమానంగా విద్యను అందించాలని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధిగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. కాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురుకుల పాఠశాల వ్యవస్థను కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనం అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు అంటే గురుకుల పాఠశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, పండుగల సందర్భంగా పేద ప్రజలకు దుస్తుల పంపిణీ ఇవ్వన్నీ కెసిఆర్ ఆనవాళ్లే అని గుర్తు చేశారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్ధుల అడ్మిషన్ శాతం తగ్గిందని, కేసీఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ల కోసం పోటీ ఉండేది, రాష్ట్రంలో 40 వేల అడ్మిషన్ లు ఉంటే, 4 లక్షల అప్లికేషన్ లు వచ్చేవని గుర్తు చేశారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గురుకుల పాఠశాలలో చేరే వారి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని, దానికి కారణం ఈ ప్రభుత్వం తల్లిదండ్రులకు వారి పిల్లలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాల వ్యవస్థను ఒక అనాధ వ్యవస్థల తయారు చేసిందని తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. రెండు రోజుల క్రితం ధర్మపురి మైనారిటీ గురుకుల కళాశాలలో భోజనం వికటించి 5 విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారన్నారు.స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఆందోళన చేస్తే తప్ప చర్యలు తీసుకొని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కి మాజీ మంత్రి విజ్ఞప్తి చేశారు. మేము వచ్చింది ఇక్కడ ఆందోళన చేయడానికి కాదని, ఇక్కడ గురుకుల కళాశాలలో లోపాలను తెలుసుకొని, మళ్లీ మీ దృష్టికి తీసుకు రావడానికేనని అన్నారు. ఇక్కడ జరుగుతున్న విషయాలను పిల్లలతో మాట్లాడనీయకుండా నిర్బంధించి, కలెక్టర్ అనుమతి లేకుండా ఎవరూ రావద్దని ఒక ఆంక్షలు పెట్టడం సరికాదని హెచ్చరించారు.ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే గురుకులాల్లోకి ఎవరినైనా అనుమతించి, విద్యార్థులతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని, విద్యార్థులు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా వసతులు కల్పిస్తోంది అని చెప్పాలని డిమాండ్ చేశారు. కాని గేట్లకు తాళాలు వేసి, ఎవరిని రానివ్వం అని ప్రిన్సిపల్ బెదిరించి ఎవరిని అనుమతించక పోవడాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు.
Admin
Aakanksha News