Thursday, 30 July 2026 01:15:53 PM

సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి!

Date : 30 October 2022 07:51 PM Views : 472

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం(IFTU) RG 1.డివిజన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా TGLBKS-IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ హాజరై మాట్లాడుతూ..TGLBKS రాష్ట్ర ,డివిజన్, రీజినల్ మహాసభలు నవంబర్ చివరి లో జరపాలని రాష్ట్ర కమిటీ బావిస్తుందని అన్నారు. సింగరేణిలో ఎన్నికలు జరిగి దాదాపు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేటికి కూడా సింగరేణిలో ఎలక్షన్స్ పెట్టడానికి ప్రభుత్వం గానీ లేబర్ డిపార్ట్మెంట్ గాని సింగరేణి యాజమాన్యం గాని ముందుకు రాకపోవడం వల్ల కార్మికుల సమస్యల పరిష్కారం కు నోచుకోవడం లేదన్నారు. కార్మిక సంఘాల అన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ముందుకు రాలేదని పేర్కొన్నారు. ఒక కార్మిక సంఘం ఈ మధ్య కాలంలో హైకోర్టుకు పోవడం వల్ల సాధ్యమైనంత త్వరలో ఎన్నిక నిర్వహించాలని ఒక తీర్పు వచ్చిందని అన్నారు.ఇది శుభ పరిణామని హర్షం వ్యక్తం చేశారు. సింగరేణిలో కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి ఎన్నికలే ప్రధానంగా కొన్ని సంఘాలు భావిస్తన్నాయని అన్నారు.ఇప్పటికైన సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలకు రూపకల్పన చేయలన్నారు. ఈ సమావేశంలో TGLBKS (IFTU) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్, నాయకులు ఎం. దుర్గయ్య, ఎం కొమరయ్య, ఎన్ సి బాబు, పి మొండన్న, చింతల శేఖర్, ఐ సాంబయ్య, ఎ చంద్రయ్య,రాజి రెడ్డి,నాగయ్య,రమేష్,రాజయ్ సంతోష్,వేణు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :