ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కాంగ్రెస్‌పై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రజెంట్ చేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు బొటాబొటీ మెజార్టీ ఉందని.. కాంగ్రెస్‌లో గ్రూప్స్ కామన్ అని అన్నట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళ హామీలకు సహకరించదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. బలమైన ప్రతిపక్షం ఉందన్నారు. ‘‘మీరు బాగా పని చేయాల్సి ఉందని నేను చెప్పాను. మేము అన్న దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. భయపడుతున్నారు. అందుకే మేము ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి ప్రచారం చేసుకుంటున్నారు’’ అంటూ కడియం శ్రీహరి పేర్కొన్నారు.
Admin
Aakanksha News