Friday, 31 July 2026 05:22:58 PM

"రాజకీయ"సమరానికి రంగం సిద్ధం...⁉️

త్వరలోనే అధికారిక ప్రకటన...❓

Date : 23 September 2023 10:21 PM Views : 753

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రామగుండంలో రాజకీయ సమరానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది... ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ ప్రకటనలు కానీ పూర్తి స్థాయిలో కార్యక్రమాలలో పాల్గొనని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే రామగుండం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వెళ్తున్నారంటూ జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వీటన్నిటికీ బ్రేకులు వేసి మరోసారి రాజకీయాల్లో తన మార్కును చూపించే అందుకు తన అనుచరులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు పూర్తిస్థాయిలో ప్రచారాలను ముమ్మరం చేశారు. అయితే ఎవరి ప్రచారాలు వారు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే మాత్రం తన రాజకీయ మేధోశక్తికి పదును పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేసి రామగుండం రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో మాజీ ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తే రాజకీయ సమీకరణాలు మారతాయని పలు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా మరోసారి రామగుండం రాజకీయాలు సంచలనంగా మారనున్నట్లు తెలుస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :