ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రశ్నించే గొంతును ఎవరు నొక్కలెరని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ నాయకులు దాడి చేయడం సిగ్గుచేటని.. ఈ దాడులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు... గుండాయిజం రౌడీయిజం చేయాలనుకుంటే బిజెపి కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరని అన్నారు.. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు దాడులు చేయడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. గడిల దాడులకు గడిల గుండాల దాడులకు, తోక ఊపులకు భయపడేది లేదని హెచ్చరించారు. బిజెపి సహనాన్ని చేతకానితనం అనుకోవద్దని, ప్రజలే టిఆర్ఎస్ పార్టీ గుండాలకు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మండిపడ్డారు.
Admin
Aakanksha News