Saturday, 13 June 2026 02:27:51 PM

అధికారానికి నిబంధనలు వర్తించవా...?

చోద్యం చూస్తున్న సింగరేణి మున్సిపల్ అధికారులు...

Date : 19 September 2023 09:42 PM Views : 858

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అధికారానికి నిబంధనలు వర్తించవా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మున్సిపల్, సింగరేణి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతుంది. వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. అయితే ఇంటి నిర్మాణం జరిగే వద్ద సింగరేణికి సంబంధించిన హై టెన్షన్ సంబంధించి కరెంట్ బంగ్లాస్ ఏరియకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కరెంటు వైర్ ను ఏకంగా నూతనంగా నిర్మిస్తున్న ఇంటి గోడ లోపల నుండి కట్టడాలు నిర్మించిన ఇది సింగరేణి,మున్సిపల్ అధికారులకు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా చిన్న షెడ్డు వేసుకుంటేనే ఆగ మేఘాల మీద వచ్చి కూల్చివేసే ఈ ఇంటి నిర్మాణంపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత ప్రమాదకరంగా ఉందని తెలిసిన మున్సిపల్ అధికారులు అనుమతులు ఎలా మంజూరు చేశారో వారికి తెలియాలని పలువురు విమర్శిస్తున్నారు. ఈ మధ్యకాలంలో గోదావరిఖని కేసీఆర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి నిర్మాణం వద్ద మేస్త్రి కరెంటు షాక్ తగిలి మృతి చెందిన ఘటన మరువక ముందే ఇలాంటి కట్టడాలు చోటు చేసుకోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ఇప్పటికైనా దీనిపై ఇటు సింగరేణి అధికారులు కానీ అటు మున్సిపల్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :