Thursday, 30 July 2026 09:52:29 PM

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్హస్టల్ లో పురుగుల అన్నం...

ఆందోళనకు దిగిన విద్యార్థులు... క్యాంపస్ లో ఉద్రిక్తత

Date : 05 March 2024 06:30 PM Views : 539

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారు గండి మైసమ్మ లో ఉన్న MREC క్యాంపస్ వసతి గృహంలో 2024, మార్చి 4వ తేదీ సోమవారం రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు.రాత్రి భోజన సమయంలో అన్నం, స్వీట్ లో పురుగులు రావడంతో విద్యార్థులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్యాంపస్ లో నిరసన చేపట్టారు. క్వాలిటీ ఫుట్ పెట్టడం లేదని.. వీ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు.ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్ లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నాలు చేశారు. దీంతో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెడతామని కాలేజీ చైర్మన్ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. అయితే, కొద్ది రోజులకే మళ్లీ అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి వచ్చేంత వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :