ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : నేటి సమాజంలో ఏదైనా సంఘటన జరిగితే మనకు ఎందుకులే అని చూసుకొని వెళ్లే పరిస్థితిలో నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తూ అందరి కడుపు నిండా అన్నం పెడుతూ తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నాడు. సమాజం మనకు ఎంతో ఇచ్చింది. మనం కూడా ఆపదలో ఉన్న వారికీ మనవంతు సహాయ సహకారాలను అందించాలనే ఉద్దేశంతో ఎంతో మంది నిస్సహాయులతో ఆకలి తీర్చుతున్న అమ్మ పరివార్ స్వచ్చంధ సేవ సంస్థపై ప్రత్యేక కథనం... పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మంద నాగరాజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అమ్మ పరివార్ పేరుతో సేవలను ప్రారంభించారు. అప్పటి నుండి ఈ సంస్థ ద్వారా హెల్త్ క్యాంపులు,నిరుపేద కుటుంబాలకు ఆర్ధిక సహాయం, చలి వేంద్రాలు, అన్నదానాలు, సదస్సులు,రక్తదానం ఇలాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అనంతరం 2013లో అమ్మ పరివార్ అశ్రమం 6గురు పిల్లలతో ఏర్పాటు చేసారు. అప్పటి నుండి ఇలా ఎంతో మంది పిల్లలను చేరదీసి వారికి విద్యనందిస్తూ విద్యార్థులుగా తీర్చిదితున్నారు. ఒక్కపుడు 6 పిల్లలతో ప్రారంభం ఐన అశ్రమంలో నేడు 100 మందికి పైగా ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కరి ఇద్దరిని చూసుకుంటూ వారికీ కావాల్సింది ఇవ్వడంలో ఎన్నో ఇబ్బందులు పడే ఈ రోజుల్లో 100 మందికి పైగా పిల్లలని చూసుకుంటూ వారికీ కావాల్సింది అందిస్తూ వారికీ వసతితో పాటు ఆలనా, పాలనా అన్ని చూసుకుంటున్న అమ్మ పరివార్ సేవలు అభినందనీయమని పలువురు కొనియాడుతున్నారు. అలాగే ఎంతో మంది పిల్లలకు చేయూతనందిస్తూ వారికీ కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యాక్రమం 2016 వ సంవత్సరంలో మొదలు పెట్టి చిన్నపిల్లలకు న్యూట్రిషన్ హెల్త్ ఫుడ్ తో పాటు వారికి బట్టలను అందిస్తుంది. అలాగే కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నిరుపేద కుటుంబాలకు చిల్లర సమానులతో పాటు బియ్యాన్ని అమ్మ పరివార్ సంస్థ ద్వారా ఎంతో మంది కుటుంబాలకు అందజేశారు. ఇలాంటి ఎన్నో సేవలు అందిస్తూ మరో వైపు ప్రతి రోజు రోడ్లపై ఆకలితో అలమటించే ఎంతో మంది వద్దకు స్వయంగా ధీచక్ర వాహనం పై తిరుగుతూ ప్రతి రోజు రెండు పుటలు ఆహారాన్ని అందిస్తున్నారు.ఇలా నిరుపేదలకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సుమారు 120 మందికి భోజనాన్ని అందిస్తున్నారు. ఇది ఎలా ఉంటె భారీ వర్షాల సమయంలో సైతం ఇల్లులు , కాలనీలు మునిగిపోవడంతో ఎంతో మంది కుటుంబాలకు రైస్ బ్యాగులతో పాటు ఇతర వంట సామాగ్రిని అందించారు. అమ్మ పరివార్ సేవ సంస్థ నిర్వాహకులు మంద నాగరాజు ఇలాంటి సేవ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ తమకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంటున్నారు. ఓ వైపు ఆశ్రమంలో ఉన్న పిల్లలను చూసుకుంటూనే మారో వైపు ఎంతో మందికి ఆహారాన్ని సమయానికి అందిస్తూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న అమ్మ పరివార్ సేవలను పలువురు కొనియాడుతున్నారు. ఇలాంటి సేవ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు.
Admin
Aakanksha News