ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్ తరపున బంగారు పతకం సాధించిన భద్రాచలంకు చెందిన వంశీ మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారుఇటీవల జరిగిన సౌత్ ఆఫ్రికా కామన్ వెల్త్ క్రీడల్లో పవర్ లిఫ్టింగ్ లో వంశీ. గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా వంశీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News