Thursday, 30 July 2026 10:47:28 PM

తెలంగాణ విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శం

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 06 October 2023 02:17 PM Views : 598

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎర్పాడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ విద్య వ్యవస్థపై దృష్టి పెట్టారని విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తుా తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రామగుండం 21 వ డివిజన్ లో లని ప్రభుత్వ ప్రాధమీక పాఠశాలలో సిఎం కేసీఆర్‌ అల్పాహార పధకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశ చరిత్రలో ఈ రోజు చరిత్ర నిలిచిపోయేాదని దేశంలో ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయని విధంగా మానవీయ కోణంలో ఆలోచించి పెద విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకాన్ని తీసుకు వచ్చిన మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రతి ఇంట్లో న్యూట్రీషియన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, మనం తినే కూరగాయలు మనమే పండించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచిత విద్య ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కనిపిస్తున్న గోప్ప సీఎం కేసీఆర్ అన్నారు. విద్యార్థులకు అల్పాహారం పథకం అమలు చేసిన సిఎం కేసీఆర్‌కి రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జెడ్పిటిసి అమల నారాయణ, కార్పొరేటర్ కౌశిక లత, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఇసంపల్లి తిరుపతి, ఆతరోద్దీన్, ఎమ్ ఈ ఓ సంపత్ రావు, అధికారి స్వరూపారాణి, టీచర్లు శారద, అనిత బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :