Thursday, 30 July 2026 03:08:22 PM

తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన ప్రధాని మోదీ

ప్రధానిపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఆగ్రహం

Date : 08 July 2023 05:24 PM Views : 529

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని ఏపీలో ఏడు మండలాలు కలిపి తెలంగాణను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దేశానికి కరువొచ్చినా.. దేశానికి అన్నం పెట్టగలిగే స్థాయిలో తెలంగాణ ఉందని అన్నారు. కర్ణాటకలో అత్యంత అవినీతి చేసింది బీజేపీ ప్రభుత్వమే అని విమర్శించారు. 80 కోట్ల బీసీలు మీరు ప్రధాని అయితే సంతోష పడ్డారని.. కానీ బీసీ మంత్రిత్వ శాఖ లేని ప్రభుత్వం బీజేపీదన్నారు. అవినీతి జరిగి ఉంటే ఇన్ని అద్భుత పథకాలు ఎలా వస్తాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అసలు తెలంగాణ ఉద్యమంలో అసలు బీజేపీ పాత్ర ఏంటని ప్రశ్నించారు. విశ్వాస ఘాతకుడు మోడీ అంటూ విరుచుకుపడ్డారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :