Friday, 31 July 2026 07:31:41 PM

భారీ బహిరంగ సభకు సన్నహాలు...

కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్న ఆశావాహులు.

Date : 26 July 2023 01:03 PM Views : 1735

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు దీటుగా రామగుండం రాజకీయాలు ఏమాత్రం తీసుపోని విధంగా సాగుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల కంటే రామగుండం నియోజకవర్గం రాజకీయాలే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నిత్యం వార్తల్లో నిలుస్తూ రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారుతుంది. గత కొంత కాలంగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆశావాహులు చేసిన కార్యాచరణతో రాజకీయ వర్గాల్లో దుమారాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి. కన్నాల సింగల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, రామగుండం నగర పాలక సంస్థ తొలి మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు పాతిపల్లి ఎల్లయ్య లు స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించారు. దీంతో రామగుండం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే దీనిపై స్పందించిన అధిష్టానం ఆశవహులతో చర్చలు జరిపేందుకు మంత్రిని రంగంలోకి దింపి అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సిద్ధం కాగా అనివార్య కారణాలతో అధిష్టానంతో చర్చలు వాయిదా పడడంతో ఆశవోలు మరో ముందడుగు వేశారు ఈ నేపథ్యంలోనే ఈ నెల 29 లేదా 30వ తేదీన గోదావరిఖనిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే 5 నుంచి 10వేల మందితో ఈ సభ నిర్వహించినందుకు ఆశావాహులంతా సమావేశమైనట్లు తెలుస్తుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :