ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : జడ్జి ముందు తీన్మార్ మల్లన్నను మేడిపల్లి పోలీసులు హాజరు పరిచారు. ఈ మేరకు తీన్మార్ మల్లన్న పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని విడుదల చేశారు. అయితే ఈ నెల 19వ తేదీన బిఆర్ఎస్ పార్టీపై అసత్య తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని అడగడానికి వెళ్లిన నాపై దాడి చేసి నిర్బంధించి కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారని, నాన బూతులు తిట్టారని నా జేబులో ఉన్న నగదు మెడలో చైను చేతికి ఉన్న ఉంగరం బలవంతంగా లాక్కున్నారని సాయి కిరణ్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సమయానికి అక్కడికి పోలీసులు రావడంతో బయటపడ్డానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తీన్మార్ మల్లన్నపై 148.307.342.506. 384.109,r/w 149 సెక్షన్ల కింద 7 కేసులు నమోదైనట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
Admin
Aakanksha News