Friday, 31 July 2026 02:40:25 PM

అవాస్తవాన్ని అసమర్థత అని చెప్పడం ఆయనకే సొంతం..?

కౌశిక హరిపై మాజీ ఎమ్మెల్యే సోమారపు ఫైర్..

Date : 21 March 2023 12:56 PM Views : 806

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అవాస్తవాన్ని అసమర్థత అని చెప్పడం ఆయనకే సొంతం అని బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా గోదావరిఖని శివాజీ నగర్ లోని బిజెపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ...కౌశిక హరి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఎవరికి తెలియదని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసమే కౌశిక హరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని పేర్కొన్నారు. సొంత పార్టీలో ఉంటూనే అదే పార్టీ నాయకునిపై విమర్శలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానాని అన్నారు. కౌశిక హరి ఒక్క టిఆర్ఎస్ పార్టీ మినహాయించి అన్ని పార్టీలు తిరిగడని ఆయన జీవితం మొత్తం భూకబ్జాలు, మోసాలు, పైరవీలు, దందాలు కేసులే అని ఆరోపించారు. కేశోరాం ఫ్యాక్టరీలో కార్మికుల చిదరించుకునే పరిస్థితికి ఆయన దిగజారి పోయాడని అన్నారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :