ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే భరసా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తెలంగాణ ఉద్యమకారుడు కోరుకంటి చందర్ కి టికెట్ ఇవ్వద్దు అని కొంతమంది భరసాకు చెందిన అసమ్మతి వాదులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం అని భరసా అధికార ప్రతినిధి గుంపుల ఓదెల యాదవ్ అన్నారు. పార్టీలో ఏమైనా అంతర్గత విభేదాలు ఉంటే చర్చించుకోవాలి తప్ప బహిరంగంగా పార్టీ నాయకులను విమర్శించడం సరికాదని వారు హితవు పలికారు. రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారునిగా ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో ఇండిపెండెంట్ శాసనసభ్యునిగా విజయం సాధించిన ఎమ్మెల్యే చందర్ పై ఇష్టానుసారంగా మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.అధిష్టానం టికెట్ ఎవరికీ ఇచ్చినా పార్టీ నాయకులు అంతా కలిసి పని చేస్తారే తప్ప ఫలానా వారికి ఇవ్వద్దు అని అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే పనితీరుని విమర్శించడం మాని పార్టీ అభివృద్ధి కోసం సహకరించాలని వారు పిలుపునిచ్చారు.
Admin
Aakanksha News