Friday, 31 July 2026 11:27:36 PM

బీజేపీనీ వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను...

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ఆడియో లీక్

Date : 14 February 2025 11:34 AM Views : 620

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బీజేపీనీ వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను...పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ఆడియో లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఆడియోలో ఉండటం ఆ వాయిస్ ఆయనదేనా లేక వేరొకకరిదా అనేది ధృవీకరించాల్సి ఉంది. అయితే గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వమని సూచిస్తే, నా సూచనలు పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీతో తిరిగే వ్యక్తికి ఇచ్చారని మండిపడినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. దీనిపై ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నానని రాజాసింగ్ వ్యాఖ్యానించినట్లుగా ఆడియోలో ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :