Sunday, 26 April 2026 06:40:46 PM

సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత ఇంటిపై ఐటీ అధికారుల దాడులు...

Date : 21 January 2025 01:21 PM Views : 437

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్‌ లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత, దిల్ రాజుకు చెందిన ఇల్లు, ఆఫీసులు ఇలా 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.దిల్ రాజు ఇంటితో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్సిత రెడ్డి నివాసాలపై కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :