Thursday, 30 July 2026 03:01:02 PM

కమిషన్ కోసం కార్పొరేటర్ హల్ చల్...?

కాంట్రాక్టర్ ఇంటికి వెళ్లి దాడికి యత్నం...?

Date : 24 January 2023 08:39 AM Views : 1733

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కమిషన్ కోసం ఓ కార్పొరేటర్ హల్ చల్ చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.... ఓ డివిజన్ లో నడుస్తున్న సీసీ రోడ్డు పనుల కాంట్రాక్టు చేసినందుకు సదరు జాతీయ పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ తనకు కమిషన్ ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ ఇంటికి వెళ్లి కాంట్రాక్టర్ తో పాటు తన బంధువులపై కార్పొరేటర్ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. సదురు కార్పొరేటర్ వ్యవహార శైలి రామగుండం నియోజకవర్గంలో వివాదాస్పదంగా మారుతుంది. ఇప్పటికే కాంట్రాక్టర్ పై ఓ కార్పొరేటర్ దాడి చేసిన ఘటన చర్చకు దారితీస్తుంది. దీనిపై ఆయా పార్టీ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :