Thursday, 30 July 2026 12:33:45 PM

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు నిజం కావు..

మల్లన్న చేసిన వ్యాఖ్యలు కేవలం తన ఉనికి కోసమే... సి డబ్లు. సి సభ్యులు వంశీ చంద్ రెడ్డి

Date : 06 March 2025 06:24 AM Views : 552

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు నిజం కావని మల్లన్న చేసిన వ్యాఖ్యలు కేవలం తన ఉనికి కోసమేనని ఆయన వ్యాఖ్యలను సి డబ్లు. సి సభ్యులు వంశీ చంద్ రెడ్డి ఖండించారు. గాంధీ భావన లో మీ డియా తో మాట్లాడుతూ నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయం.. నా గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో శ్రమించారన్నారు. కవిత జైల్లో ఉండడంతో ఆమెను బయటకు తెచ్చేందుకు బిఆర్ఎస్, బీజేపీకి అమ్ముడుపోయిందని ఆరోపించారు. బిఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలలో భాగంగానే మహబూబ్ నగర్ లో బీజేపీ గెలిచిందన్నారు. గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఎంపీ గా పని చేసిన మహబూబ్ నగర్ లో సిట్టింగ్ బిఆర్ఎస్ సీట్లో బిఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయి బీజేపీ కి మద్దతు ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు నా గెలుపు కోసం సమిష్ట కృషి చేశారన్నారు వంశీచంద్ రెడ్డి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :