ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ గొడవల నేపథ్యంలో జరుగుతున్న ఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా జర్నలిస్టులపై దాడి చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు దాడిని తీవ్రంగా ఖండించారు. వెంటనే మీడియాకు క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అయితే మోహన్ బాబు చేసిన దాడిలో ఓ జర్నలిస్టుకు తీవ్ర గాయాలు కావడంతో పాటు ఎముక విరిగిందని సర్జరీ చేయాలని డాక్టర్లు ప్రకటించారు.ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పహాది షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబుపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను జర్నలిస్టులు చేపడుతున్నారు..
Admin
Aakanksha News