Friday, 31 July 2026 03:48:32 PM

గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను పెంచి,ఉద్యోగ భద్రత కల్పించాలి

IFTU జిల్లా అధ్యక్షులు గంజిపేట రాజు

Date : 16 October 2022 10:07 PM Views : 411

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మహబూబ్‌నగర్‌ జిల్లా : జోగులంభ గద్వాల జిల్లా,జిల్లా కేంద్రంలోని ఇఫ్ట్ కార్యాలయంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్(IFTU అనుబంధ గ్రామ పంచాయతీ వర్కర్స్ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఇఫ్ట్ జిల్లా సహాయ కార్యదర్శి యం.నర్సింహులు అధ్యక్షత వహించగా గంజిపేట రాజు హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న పారిశుద్ధ్యం,నర్సరీలు,వాటర్ మెన్,వీధి దీపాల నిర్వాహణ, పన్నులు వసూలు చేయుట, ఆఫిసు నిర్వహణ తదితర పనులలో వివిధ కేటగిరీల క్రింద పని చేస్తున్న సిబ్బంది వేతనాలను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దళిత ఎంపవర్ మెంట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను పెంచి వారికి పీఆర్ సీ తరహాలో నిర్ణయాత్మకమైన ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారని కావున ముఖ్యమంత్రి చేసిన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకు వచ్చేందుకు వెంటనే జీ.వో జారీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 36 వేల గ్రామ పంచాయతీ కార్మికులకు కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ తదితర పద్దతుల్లో పని చేస్తున్న కార్మికులకు అదే విధంగానే వర్తింప చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం పిఆర్సి ఆధారంగా వెంటనే కార్మికులకు వేతనాలు పెంచి కేటగిరీల వారీగా వేతనాలను చెల్లించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పని చేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు,కార్మికులకు ప్రభుత్వం వేతనాలు పెంచి జీఓలను జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం జీ.ఓ.జారీ చేసి చేతులు దులుపుకొని వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు.ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం పునఃపరిశీలన చేసి పంచాయతీ వర్కర్ల కు కార్మికులకు 30 శాతం పీఆర్సీ ప్రకారం జీతాలు,మల్టీపర్పస్ రద్దు చేయాలని కేటగిరీల వారిగా పెంచి ఇవ్వాలని IFTU డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు విడుదల చేసిన జీవోలు అన్ని అమలు చేయడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని అన్నారు. జీవో నెంబర్ 51 ప్రకారం 8500/- రూపాయలు జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామ పంచాయతీలో అమలు కావడం లేదన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.వేతనాలు పెండింగ్ లో ఉండటం వలన కార్మికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రెండు లక్షల జీవిత బీమా ప్రతి కార్మికునికి అమలు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లా యూనిట్ గా తీసుకొని కార్మికులందరికీ ఈఎస్ఐ,పీఎఫ్ అమలు చేయాలన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు తమకు అనుకూలమైన మనుషులను గ్రామ పంచాయతీలలో నియమించుకున్నారని.ఎలాంటి కారణాలు లేకున్నా అక్రమంగా కార్మికులను తొలగించారని అన్నారు.అలా తొలగించిన కార్మికులందరినీ తిరిగి నియమించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో వివిధ గ్రామ పంచాయతీ కార్మికులు అసలు నర్సింహులు, రాములు, బుజమ్మ, అంజి,పంటయ్య, రాజు,రంగస్వామి,నర్సింహులుఅలిసాబ్,జయన్న,నల్లాస్వామిరాముడు,హనుమంతు,పెద్ద కిష్టప్ప,తదితరులు ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :