Saturday, 13 June 2026 02:33:56 PM

గురుకులాలు హాస్టళ్ళపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరపాలి...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేఖ..

Date : 30 November 2024 07:46 PM Views : 392

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ గురుకుల పాఠశాలలపై హాస్టళ్ళు నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపి చర్చించాలని సంస్కరణలు చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ విద్యా సంవత్సరంలో 42 మంది విద్యార్థులు చనిపోయారు. దాదాపు 1200 మంది విద్యార్థులు అనారోగ్యంతో ఆస్పత్తుల పాలయ్యారు. దీనిని రాజకీయ కోణంలో చూడకుండా నిష్పక్షపాతంగా పిల్లల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి సంస్కరణ కోణంలో చూడాలని సూచించారు. ప్రజలలో విశ్వాసం కలిగించే విధంగా చర్చలు తీసుకోవాలని కోరారు. గురుకులాల ఫుడ్ పాయిజన్, అనారోగ్య పరిస్థితులపై తీవ్రస్థాయి చర్చ జరుగుతున్నందున కొన్ని విషయాలు ముఖ్యంగా పాలన విధానంలో ఉన్న లోపాలు సరిదిద్దవలసిన అవసరం ఉంది. ఎక్కువ సంఖ్యలో గురుకుల పాఠశాలలో యున్నందున సంఖ్య అధికమై నియంత్ర విధానంపై పట్టు తప్పుతుంది. అలాంటప్పుడు మౌలికంగా పాలన విధానంలో పాలన సరిదిద్దవలసిన అవసరం ఉంది. గురుకుల పాఠశాలలో RCOలు - కోఆర్డినేటర్లు కొందరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. దీన్ని మూలంగా ఆహారంలో క్వాలిటీ పడిపోతుంది. అలాగే భోజనాలు కాంట్రాక్టు పద్దమీద భోజనాలు తయారు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు - కోఆర్డినేటర్లు చాలా చోట్ల కుమ్మకయ్యారు. నిత్యవసర వస్తువులలో కాలం చెల్లిన వాటిని భోజనం తయారీకి ఉపయోగిస్తున్నారు. దీని మూలంగా ఫుడ్ క్వాలిటీ పడిపోతుంది. అంతేకాక ఒకరోజు మిగిలిన వంటలు మరుసటి రోజు ఇస్తున్నారు. వీటిని సరిదిద్దవలసిన అవసరం ఉంది. దీనిపై చర్చించి మార్పులు - పాలనలు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. గురుకులాల్లో కాంట్రాక్ట్ వంటల పద్ధతిపై చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక కాలేజీ హాస్టళ్ళ నిర్వహణ కూడా హస్తవ్యస్తంగా తయారయింది. దీనిపై కూడా చర్చించి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నాన్ టీచింగ్ సిబ్బందిని పెంచవలసిన అవసరం యుంది.రాష్ట్ర ప్రభుత్వం 2008లో ఉమ్మడి రాష్ట్రంలో 300 బి.సి బాలికల హాస్టళ్ళు, 2010 లో 300 బి.సి బాలుర హాస్టల్లు మంజూరు చేసింది. హాస్టళ్ళ పరిపాలన విధానంలో ఇంతవరకు ఒక నిర్దిష్టమైన-ప్రటిష్టమైన పాలన విధానం రూపొందించలేదు, ఈ హాస్టల్లో పీజీ, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ కోర్సులు చదివే విద్యార్థులు ఉన్నారు,. వీరికి మంచి భోజనం వసతి సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉంది. అందుకుగాను ఈ క్రింది సూచనలు ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 1. బి.సి హాస్టళ్ళలో వర్కర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించాలి. ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించడం వలన పని భారం ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నారు. ప్రతి హాస్టల్ కు నలుగురు శాశ్వత వర్కర్స్ ను నియమించాలి. 1. అటెండర్ 2. వాచ్ మెన్ 3. కమాటి 4. కుక్ చొప్పున శాశ్వత ప్రతిపదికన నియమించాలి. ఇప్పుడు పని చేస్తున్న వారిని వరుసగా నాలుగు సంవత్సరాలుగా నిండి ఉన్నట్లైతే వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేసారు.

హాస్టల్లో 150 విద్యార్ధుల కంటే ఎక్కువ సంఖ్య ఉన్నచోట ప్రతి 25 మందికి ఒక వర్కర్ ను ఆధానంగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలి. ప్రస్తుత 300 మంది విద్యార్థులులకి ముగ్గురు వర్కర్లు ఉన్నారు. పని భారంతో విద్యార్థులకు అసౌకర్యం గా ఉంది. విద్యార్థుల చదువు దెబ్బతింటుంది. హాస్టల్ పరిశుభ్రత దెబ్బతింటుంది. హాస్టళ్ళు శుభ్రం చేసేవారు లేక మురికి కూపాలుగా మారుతున్నాయన్నారు.

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టును గ్రేడ్-I గా అప్ గ్రేడ్ చేయాలి. గతంలో 2008కి పూర్వం మంజూరైన హాస్టళ్ళకు గ్రేడ్-I వార్డెన్ పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే హాస్టల్లలో ఎక్కువగా డిగ్రీ, పీజీ చేసే విద్యార్థులు ఉన్నారు వీరికి ఎక్కువ స్టేటస్ ఉన్న అధికారాలు కావాలి. కాబట్టి బి.సి హాస్టల్లను విద్యార్థుల చదువు, విద్యా ప్రమాణాలను పెంచవలసిన అవసరం ఉంది. మానవ వనరులను తీర్చి దిద్దవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :