Friday, 31 July 2026 07:49:40 PM

భూకబ్జా కేసులో కేటీఆర్ ప్రధాన అనుచరుడి అరెస్టు!

Date : 30 November 2024 05:48 PM Views : 578

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రాజన్న సిరిసిల్ల జిల్లా : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్ఏ కెటిఆర్ అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్లా మున్సిపల్ పరిధిలోని సర్దపూర్ లో కెటిఆర్ ప్రధాన అనుచరుడు బిఆర్ఎస్ కీలక నేత బొల్లి రామ్మోహన్ ను అరెస్టు చేశారు. అతడు అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జాచేసి, చాలా కాలంగా కంకర క్వారీ నిర్వహిస్తున్నాడని అభియోగం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అతడిని శనివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బొల్లి రామ్మోహన్ సిరిసిల్ల పట్టణ బిఆర్ఎస్ బిసి విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అతడు ఇసుక మాఫియా, భూకబ్జా చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడని ఆరోపణలున్నాయి. కాగా రామ్మోహన్ అరెస్టు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :