ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : పెండింగ్ చలాన్స్ చెల్లింపు దారులకు పోలీసులు కీలక సూచనలు చేసారు.ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ లో పెండింగ్ చలాన్స్ చెల్లింపుల విషయంలో అధికారులు ఆఫర్ ప్రకటించగా..కేటుగాళ్లు దీనిపై కూడా ఫోకస్ చేశారు. ఈ క్రమంలో దుండగులు www.echallantspolice.in పేరుతో ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఈ ఫేక్ వెబ్‌సైట్‌లో పొరపాటున కూడాపేమెంట్స్ చేయోద్దని సూచించారు. అంతేకాదు అసలువెబ్‌సైట్ www.echallan.tspolice.gov.in/publicview దీనిలో మాత్రమే పేమెంట్స్ చేయాలని పోలీసులు స్పష్టం చేశారు.ఈ క్రమంలో వాహనదారులు పేమెంట్చేసే విషయంలో తొందర వద్దని పోలీసులు అన్నారు. ఒకటికి రెండు సార్లు అధికారిక వెబ్‌సైట్ పేరు పరిశీలన చేసుకుని చెల్లింపులు చేయాలని కోరారు. అంతేకాదు పేటీఎం, మీ సేవా కేంద్రాల్లో కూడా పెండింగ్ చలాన్స్ చెల్లింపులు చేయవచ్చని చెప్పారు. ఈ క్రమంలో అసలు నకిలీ వెబ్‌సైట్ ఎవరు క్రియేట్ చేశారు? వెబ్ క్రియేట్ చేసిన వారు ఇక్కడి వాళ్లేనా లేదా అని సైబర్ క్రైమ్ పోలీసులు పలు రకాల వివరాలను ఆరా తీస్తున్నారు.
Admin
Aakanksha News