ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ లను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.హెచ్.వి.ఎస్. జనార్దన్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి చదువుతున్న బాలికలతో తప్పుగా ప్రవర్తించిన పి.సదానందం (ఇంగ్లీష్ ), అబ్దుల్ ఖాదరీ (బయో సైన్స్) అనే స్కూల్ అసిస్టెంట్లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Admin
Aakanksha News