Thursday, 30 July 2026 02:53:46 PM

మోడీ రాకను నిరసిస్తూ న్యాయవాదుల ప్రదర్శన

Date : 11 November 2022 11:16 PM Views : 335

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : భారత ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం రాకను నిరసిస్తూ శుక్రవారం అఖిలభారత న్యాయవాదుల సంఘం( ఐలు) భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) లీగల్ సెల్ ఆధ్వర్యంలో గోదావరిఖని మున్సిఫ్ కోర్టు కాంప్లెక్స్ వద్ద ప్ల కార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐలు జాతీయ కౌన్సిల్ సభ్యురాలు చందాల శైలజ బిఆర్ఎస్ లీగల్ సెల్ బాధ్యతలు జవ్వాజి శ్రీనివాసు మాట్లాడుతూ..న్యాయవాదులకు వృత్తిపరంగా ఇబ్బందులకు గురిచేస్తున్న 41A సి ఆర్ పి సి ని వెంటనే రద్దు చేయాలని విదేశీ చట్టాలను విదేశీ న్యాయవాదులను భారతదేశంలోకి అనుమతించవద్దన్నారు.సింగరేణి సంస్థను ప్రైవేటీకరించవద్దని రాజీవ్ రహదారిని ఆరు లైన్లు గా మార్చి జాతీయ రహదారిగా ప్రకటించాలని రామగుండం నుంచి మణుగూరు వరకు రైల్వే లైను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఆర్, ఎఫ్ సి ఎల్, ఎన్టీపీసీ ప్రైవేటు కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు గోషిక ప్రకాష్, ఎరుకల ప్రదీప్ కుమార్,మురళి నూతి సురేష్ కుమార్, ముచ్చకుర్తి కుమార్, దుడపక లింగస్వామి, మాదాసు శ్రీనివాస్, గొట్ట తిరుపతి, రామగిరి విక్రమ్ సింగ్, వెంకటేష్, ప్రసన్న, రేష్మ సంకీర్తన తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :