Thursday, 30 July 2026 11:18:47 AM

30 మంది సహాయకులకు మిషన్ భగీరథ ఇంట్రా అవగాహన

పెద్దపల్లి మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జి.శ్రీనివాస్

Date : 22 August 2023 05:12 PM Views : 467

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : మిషన్ భగీరథ ఇంట్రాపై అవగాహన కల్పించి, గ్రామాల్లో త్రాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జి.శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని మిషన్ భగీరథ శాఖకు నూతనంగా కేటాయించిన 30 మంది సహాయకులకు పెద్దపల్లి మండలంలోని హనుమంతునిపేట గ్రామపంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ ఇంట్రా పై నిర్వహించిన క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలో ఏర్పాటు చేసిన ఓవర్ హెడ్ నీటి ట్యాంకుల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, గేట్ వాల్వ్ లు, పైప్ లైన్ లీకేజీ జరగకుండా చూడాలని, మంచినీటి ట్యాంకులను ప్రతి 10 రోజులకు శుభ్రం చేయాలని, మంచినీటి ట్యాంకులు క్లోరినేషన్ చేయు విధానం, మంచినీటి నాణ్యత పరీక్షల నిర్వహణపై అవగాహన కల్పించామని అన్నారు.ప్రతి ఇంటిలో ఉన్న నల్లాలను పరిశీలించి ప్రజలకు మిషన్ భగీరథ నీరు సరఫరాపై అవగాహన కల్పించే విధానాన్ని వివరించారు. ఈ సమావేశం లో పెద్దపల్లి మిషన్ భగీరథ డీఈఈ ఎ. సతీష్, ఇంట్రా ఏఈఈ ఎన్.మధు, గ్రిడ్ ఎ.ఈ.ఈ నరేష్, ఎంపిటిసి, ప్రజాప్రతినిధులు, ల్యాబ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :