Friday, 31 July 2026 12:14:13 PM

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై దాడి...?

Date : 09 November 2024 05:34 PM Views : 663

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ చౌరస్తాలోని అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ద‌ళిత బంధు రెండో విడుత నిధుల కోసం ద‌ళితులతో క‌లిసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిర‌స‌నకు దిగారు. శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్ర‌మంగా అరెస్టు చేసి దాడికి పాల్ప‌డ్డారు. దీంతో కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... నా చేయి విర‌గ్గొట్టినా, చంపినా నా నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితులందరికి ద‌ళిత‌బంధు నిధులు విడుద‌ల చేసే వ‌ర‌కు పోరాడుతూనే ఉంటానని స్ప‌ష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమ‌లు చేయ‌మ‌ని అడిగితే ఈ విధంగా దాడులు, లాఠిఛార్జిలు చేస్తారా.? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :