Friday, 31 July 2026 02:13:46 PM

ఎమ్మెల్యే చందర్ గెలుపు కోసం కృషి చేయాలి

42వ డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్

Date : 25 April 2023 02:09 PM Views : 527

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : భారత రాష్ట్ర సమితి BRS పార్టీ ఆవిర్భావం సందర్భంగా 42వ డివిజన్ ఎల్బీనగర్ సెంటర్ లో కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ జెండా ఎగుర వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి కేసీఆర్ ఉద్యమాన్ని ఉదృతం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్టాన్ని కేసీఆర్ సాధించారని అన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలకు కృషి చేస్తాడని పేర్కొన్నారు. అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ మెడికల్ కాలేజీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడికి వచ్చే విధంగా కృషి చేసారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే చందర్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కార్పొరేషన్ అధికార ప్రతినిధి పిల్లి రమేష్ మల్కోజు కృష్ణమాచారి బూత్ కమిటీ నాయకులు మహేందర్ వంగ రాజేష్ రామచందర్ బొమ్మిడి రాజనర్స్ పిల్లి రాజయ్య ఏకుల పైడ్రాజు బొల్లం రాజలింగు సంపత్ రాజయ్య పిల్లి శ్రీనివాస్ రాజు కొమురయ్య రాయసం నాయకురాలు పద్మ శ్రీలత వనిత తిరుమల సునీత లక్ష్మి లతా తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :