Friday, 31 July 2026 11:32:01 AM

రామగుండంలో కుట్ర రాజకీయాలు....

ప్రజలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లాలి...

Date : 20 April 2023 11:36 AM Views : 1427

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండంలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఎదో పెద్ద నాయకుడు వచ్చాడని వారి దృష్టిలో పడటానికి వారి మెప్పు పొందడానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై అనవసరమైన ఆరోపణలు చేసి నిందలు వేయడం మానుకోవాలని హితావు పలికారు. అలాగే ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందాలని అబద్ధపు ప్రచారాలను తిప్పి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎంతో మంది అధికారులను తీసుకవచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం చేపిస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై దళిత వ్యతిరేక అని ముద్ర వేయడం వారి అవివేకానికి నిదర్శనం అని అన్నారు. మీ హయాంలో ఒక దళితాధికారి వచ్చి ఇక్కడ పని చేయాలంటే ఇబ్బంది పడే రోజులు ఉన్నా సంఘటనలు ఎన్నో ఉన్నాయని విమర్శించారు. ఒక దళిత ముద్దుబిడ్డ రామగుండం కార్పొరేషన్ కు మేయర్ అయితే అవిశ్వాసం పెట్టి దించేసిన చరిత్ర ప్రజలందరికీ తెలుసని హితవు పలికారు. ఎమ్మెల్యే చందర్ పై దిగజారిన మాటలు మానుకోవాలని లేకపోతే ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. ప్రజలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు పోవాలని, వ్యక్తిగత కుటుంబ విమర్శలకు పోవడం సరైన పద్ధతి కాదన్నారు. మీ హయాంలో ఇక్కడ పోలీస్ అధికారులు రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. అలాంటి పరిస్థితులను రూపుమాపి అధికారులు స్వచ్ఛందంగా విధులు నిర్వహించడానికి ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా లేనిపోని విమర్శలు చేయడం మానుకొని రామగుండం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జేవీ రాజు, నారాయణ దాసు మారుతి ,పాముకుంట్ల భాస్కర్. పర్లపెల్లి రవి, గుంపుల ఓదెల యాదవ్, తోడేటి శంకర్ గౌడ్, బాలరాజు, మోహిత్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :