Friday, 31 July 2026 10:34:51 PM

దాడులకు పాల్పడటం హేయమైన చర్య...

వైయస్ఆర్ టిపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల

Date : 14 November 2022 11:14 AM Views : 451

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో వైయస్ఆర్ టిపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... పాదయాత్ర జరుగుతుండగా కొత్తూరు గ్రామంలో సభలో మాట్లాడుతు ఉన్న సమయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకోవడమే కాకుండా బెదిరించి దాడులకు పాల్పడ్డారని తెలంగాణ వైయస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మండిపడ్డారు. మాకు సంబంధించిన పాదయాత్ర వివరాలను ముందుగానే పోలీసులకు తెలిపామని ఆయన కూడా వారి ముందే కార్యకర్తలపై దాడులు చేస్తూ బెదిరిస్తూ సుమారు వందమందికి పైగా వచ్చి నైట్ హాల్టును కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా టిఆర్ఎస్ నాయకులు చేయించారని వైయస్ షర్మిల ఆరోపించారు. దాడులకు పాల్పడే ముందు టిఆర్ఎస్ నాయకులు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారని ముందుగానే పాదయాత్రను అడ్డుకోవడానికి వారు పక్క ప్లాన్ చేసుకున్నారని విమర్శించారు. అంతే కాకుండా పోలీసుల ముందే దాడులు జరిగిన ఏ ఒక్కరిని అదుపులోకి తీసుకోలేదని ఎవరిమీద కేసులు నమోదు చేయలేదని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న మాపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు. అధికార పార్టీకి తోత్తులుగా వ్యవహరించిన పోలీసులు టిఆర్ఎస్ కండువాలు కప్పుకోవాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీ చేస్తున్న అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజల్లో మాకు వస్తున్నా ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలా చేతకాని దద్దమ్మల్ల మాపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా తమ పార్టీకి సంబందించిన ప్లెక్సీలను సైతం చిచ్చి వేశారని మండిపడ్డారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :