Friday, 31 July 2026 02:41:49 PM

హన్మకొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, సిద్ధిపేట లలో ఆహార కల్తీ పరీక్ష కేంద్రాలు...

దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా. పల్లెపాడు దామోదర్

Date : 26 February 2024 09:19 PM Views : 448

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నాచారం లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల మైక్రో బయాలజీ ఆహార కల్తీ పరీక్ష కేంద్రం ను సోమవారం దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా. పల్లెపాడు దామోదర్, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, క్యాట్కో ఛైర్మన్ శంకర్ లాల్ చౌరాసియా, తెలంగాణా రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కాసు విశ్వోధర్ రాజు లకు హైదరాబాద్ లో ఉన్నటువంటి మైక్రో బయాలజీ లాబొరేటరీ విశిష్టత లను, ఆహార కల్తీ ని ధృవీకరించే ప్రత్యేకతలను చీఫ్ పబ్లిక్ అనలిస్ట్ జి. లక్ష్మీనారాయణ వినియోగదారుల ప్రతినిధులకు వివరించారు. ఆహార కల్తీ వల్ల మోసపోయామని ఎటువంటి అనుమానం కలిగినా, ఎవరైనా బాధితుడు రు. 200/- రుసుము చెల్లించి నాణ్యతా పరీక్షలు చేయించుకోవచ్చు నని చీఫ్ పబ్లిక్ అనలిస్ట్ జి. లక్ష్మీనారాయణ తెలిపారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారికంగా వినియోగదారులకు హైదరాబాద్ లోని లాబొరేటరీ అందుబాటులో ఉన్నదని ఆయన తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అమ్మకం జరుగుతున్న వివిధ రకాల వంట నూనెల్లో నాసిరకం క్రూడ్ ఆయిల్ కల్తీ, అందమైన ప్యాకింగ్ తో ఉన్న సేమియాలో మైదా పిండి కల్తీ, మామిడి పట్ల ప్యాకింగ్ లో విచ్చలవిడిగా కృత్రిమ రసాయనాలతో కూడిన పాకెట్స్ వాడకం మరియు చిన్న పిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్ లో అధికంగా హానికరమైన గ్లూటామేట్ మోనో సోడియం కల్తీ లపై నాణ్యతా పరీక్షల నిమిత్తం విన్నవించడం జరిగింది. 35% శాతం సోడియం ఉన్న నూడుల్స్ పై నేడు ఫిర్యాదు చేయడం జరిగింది, ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లె పాడు దామోదర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఆహార కల్తీ లాబొరేటరీ హన్మకొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, సిద్దిపేట లలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వపరంగా, వినియోగదారుల సంక్షేమం దృష్ట్యా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :